సంక్రాంతి సంబరాలు... విమాన ధరలకు రెక్కలు

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (12:44 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విమాన ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవి మరింత విపరీతంగా పెరిగిపోయాయి. 
 
సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు అనేక మంది తమ సొంతూర్లకు వెళుతున్నారు. ఈ ఉత్సాహం విమాన సంస్థలపై కనకవర్షం కురిపిస్తోంది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉండటంతో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు విమానాల్లో వెళుతున్నారు. 
 
హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, కొలంబో కన్నా ఏపీలోని విశాఖ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ వెళ్లే విమాన సర్వీసులకు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. రాజమండ్రికి అయితే ఒకరోజు ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడైపోతున్నాయి.
 
సోమవారం హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి అత్యధిక టికెట్‌ ధర రూ.15,157గా పలికింది. మంగళవారం సాయంత్రం 3:45 నిమిషాలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి వెళ్లే విమాన ఛార్జీ ఏకంగా రూ.19,518గా ఉంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి సోమవారం అత్యధికంగా రూ.12,027 ధర పలకగా మంగళవారం రూ.12843లు ఉంది.
 
అలాగే, విశాఖకు సోమవారం రూ.10,976 ధర ఉండగా మంగళవారం కూడా అత్యధికంగా ఇదే ధర ఉంది. విజయవాడకు సోమవారం అత్యధికంగా రూ.9995లు ధర పలకగా మంగళవారం రాత్రి టిక్కెట్‌ ధర రూ.14837గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

తర్వాతి కథనం
Show comments