Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ ఫ్యాకల్టీగా గుంటూరు మెడికో ఎంపిక .. రూ.2 కోట్ల వేతనం

గుంటూరు మోడికోను ఓ బంపర్ ఆఫర్ వరించింది. అమెరికా వైద్య విశ్వవిద్యాలయమైన స్టాన్‌ఫోర్డ్‌లో పాఠాలు బోధించే అధ్యాయపక వృత్తికి ఎంపికయ్యాడు. అదీకూడా ఎలాంటి వీసా అక్కర్లేకుండా యుఎస్‌కు వెళ్లే ఛాన్స్ దక్కించు

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (16:12 IST)
గుంటూరు మోడికోను ఓ బంపర్ ఆఫర్ వరించింది. అమెరికా వైద్య విశ్వవిద్యాలయమైన స్టాన్‌ఫోర్డ్‌లో పాఠాలు బోధించే అధ్యాయపక వృత్తికి ఎంపికయ్యాడు. అదీకూడా ఎలాంటి వీసా అక్కర్లేకుండా యుఎస్‌కు వెళ్లే ఛాన్స్ దక్కించుకోవడమేకాకుండా ఏకంగా నెలకు రూ.2 కోట్ల వేతనాన్ని అందుకోనున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరులో ఎంబీబీఎస్ పూర్తిచేసిన డాక్టర్ మిక్కిలినేని కార్తీక్‌ యువకుడు 2012లో న్యూయార్క్ వెళ్లి అక్కడి పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో 'వాస్‌క్యులర్ సర్జరీ'లో ఎండీ పూర్తి చేశాడు. ఈ విభాగంలో మొత్తం 11 సీట్లు ఉంటే అందులో 10 మంది అమెరికా వారు కాగా అమెరికాయేతర వ్యక్తి కార్తీక్ మాత్రమే కావడం గమనార్హం. 
 
అతని పరిజ్ఞానానికి మెచ్చి.. వైద్య విశ్వవిద్యాలయం స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్‌లో 'వాస్‌క్యులర్ సర్జరీ' విభాగంలో సహాయ ఆచార్యుడిగా బోధించేందుకు ఎంపిక చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ విజ్ఞప్తితో ప్రభుత్వం అతనికి 'ఓ-వన్ ఏ' వీసాను జారీ చేసింది. వీసా అవసరం లేకుండానే అమెరికాలో ఉండి పాఠాలు బోధించే అవకాశాన్ని 'ఓ-వన్ ఏ' వీసా కల్పిస్తుంది. 
 
దీంతో వచ్చే అక్టోబరు ఒకటో తేదీ నుంచి వర్శిటీలో అధ్యాపకుడిగా కార్తీక్ బాధ్యతలు చేపట్టనున్నారు. అతనికి ఏడాదికి రూ.2.08 కోట్లు వేతనంగా అందుకోనున్నారు. అయితే, ఆయన మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకు తన కుమారుడు ఎంపిక కావడంపై తండ్రి పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments