Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 31, 2018 వరకు 10జీబీ ఉచిత డేటా.. జియో సంచలనం

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకునే రీతిలో అసస్ (Asus) స్మార్ట్ ఫోన్లు కొనే వారికి అదనంగా డేటా ఆఫర్లన

Advertiesment
Reliance Jio Offers Up to 10GB Additional 4G Data on Select Asus Smartphones
, మంగళవారం, 11 జులై 2017 (14:44 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో సంస్థ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కొత్త కస్టమర్లను ఆకట్టుకునే రీతిలో అసస్ (Asus) స్మార్ట్ ఫోన్లు కొనే వారికి అదనంగా డేటా ఆఫర్లను జియో ప్రకటించింది.

Asus ZenFone Selfie, Asus ZenFone Max, Asus ZenFone Live, Asus ZenFone Go 4.5, Asus ZenFone Go 5.0, Asus ZenFone Go 5.5 వంటి అసస్ మోడల్స్‌ కొనే వారికి జియో డేటా ఆఫర్లను అందించనుంది. 
 
వినియోగదారులు అసస్ మొబైల్ తీశాక జియో సిమ్ కార్డును కూడా పొందాలి. ఆపై ప్రైమ్ మెంబర్‌‌గా చేరాలి. తర్వాత రూ.309లకు రీఛార్జ్ చేసుకుంటే 1 జీబీ డేటాతో పాటు 10జీబీ డేటాను అదనంగా అదీ ఉచితంగా పొందవచ్చును. అంతేగాకుండా ఈ అదనపు ఉచిత డేటా ఆఫర్ మార్చి 31, 2018 వరకు లభిస్తుందని జియో ప్రకటించింది.
 
మరోవైపు.. రిలయన్స్ తమ డేటా ఆఫర్లను రివైస్ చేసే పనిలో పడింది. డేటా ఆఫర్లు రూ. 19 నుంచి రూ. 9,999 వరకు వున్నాయని.. కొత్తగా రూ.349, రూ.399 ప్లాన్లను కూడా ప్రవేశపెట్టినట్లు జియో ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే ధనాధన్ ప్లాన్లను డిఫరెంట్ వ్యాలీడిటీలతో రూ.309, రూ.509లకు వినియోగదారులకు అందించనుంది. రూ.309, రూ.509 ప్లాన్లలో.. రూ.309 ప్రకారం అన్ లిమిటెడ్ డేటా (రోజుకు 1జీబీ డేటా), 56 రోజుల వ్యాలిటీతో ఎస్సెమ్మెస్, వాయిస్ కాలింగ్స్ పొందవచ్చు. అలాగే రూ.509 ప్లాన్ ప్రకారం రోజుకు జీబీ డేటా పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల వ్యూహాలు రచించడంలో నాకంటే మొనగాళ్లు ఎవరు.. ఎంపీలతో చంద్రబాబు