Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జిల్లాలో 31 వరకు శాశ్వత వ్యాక్సిన్ కేంద్రాలు

Webdunia
సోమవారం, 10 మే 2021 (11:28 IST)
జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో రద్దీని నియంత్రించేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి 31వ  వరకు 77 ప్రదేశాల్లో శాశ్వత వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఆయా కేంద్రాల్లో ఈ నెల 31 వరకు ఎవ్వరికీ మొదటి డోస్‌ వేయొద్దని కలెక్టర్‌ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రెండో డోసు వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తారు. 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, సచివాలయాల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వైరస్‌ వ్యాప్తి ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని విశాలమైన ప్రాంగణాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌ రెండు కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. 
 
ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌లు ఎలాగైతే ఏర్పాటు చేస్తారో అదే రీతిన వీటిని పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్‌లో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 77 చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. కాగా, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కి ఎర్ర రంగు, 60 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులకు పచ్చ రంగు, 45 ఏళ్ల వయస్సు దాటిన వారికి బులుగు రంగు టోకెన్లు జారీ చేస్తారు. 
 
ఎవరైతే రెండో డోస్‌ కోసం 6, ఎనిమిది వారాలు దాటిన వారు ఉంటారో వాళ్లకి టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లకు సంబంధించి రిజిష్టర్‌ నిర్వహించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రజలు, వృద్ధులకు ఒక రోజు ముందు మాత్రమే టోకెన్లను వలంటీర్ల ద్వారా జారీ చేస్తారు. 
 
ఫ్రంట్‌ లైన్‌, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కి మాత్రం సంబంధిత శాఖల అధిపతుల ద్వారా పంపిణీ చేస్తారు. టోకెన్లు దుర్వినియోగం చేస్తే సంబంధిత వీఆర్‌వో, పంచాయతీ సెక్రెటరి, వార్డు సెక్రెటరిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అన్ని చోట్ల బ్యారికేడింగ్‌ చేస్తారు. ప్రతీ కేంద్రం వద్ద ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఒక మహిళా రక్షణ కార్యదర్శి ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ- రివ్యూ

ముగిసిన ఐటీ తనిఖీలు... నిర్మాత దిల్ రాజుకు కష్టాలు తప్పవా?

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని యాక్షన్ మూవీ జాట్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments