Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ హత్య చేసిన డ్రైవర్ భార్యకు ప్రభుత్వ కొలువు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (09:21 IST)
ఇటీవల కాకినాడలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి మృతుని ఇంటపడేశాడు. ఈ హత్య కేసు సంచలనంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి మూడు రోజుల తర్వాత తాపీగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టు జ్యూడీషియల్ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి జైలుల్లో ఉన్నాడు. 
 
అయితే, మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా నియామకపత్రాన్ని సోమవారం అందజేశారు. అపర్ణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతురావుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments