తన కారు మాజీ డ్రైవర్ హత్య కేసులో అరెస్టు అయిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ సోమవారంతో ముగియనుంది. దీంతో ఆయన్ను రాజమండ్రి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన్ను రిమాండ్‌లోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం రిమాండ్‌కు అప్పగించాలని కోరుతూ పోలీసుల తరపున పిటిషన్ దాఖలు చేయనున్నారు.
మరోవైపు, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనంతబాబు తరపున కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విచారణలో కోర్టు ఆయనకు రిమాండ్‌ను పొడగిస్తుందా లేదా బెయిల్ మంజూరు చేస్తుందా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు, అనంతబాబుకు కఠిన శిక్ష విధించాలని రాష్ట్రంలోని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.