Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోటు కిందే కుప్పలుతెప్పలుగా మృతదేహాలు? బయటకు తీయడం సాధ్యమా..?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:36 IST)
పాపికొండల్లో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ ఎఫ్‌ బలగాలు. ఇప్పటికీ 34 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మూడురోజుల క్రితం బోటు బోల్తా పడితే 60 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మొదటి రోజు 8 మృతదేహాలను బయటకు తీశారు. మొత్తం 73మంది బోటులో ప్రయాణిస్తున్నారు. 
 
రెండు అంతస్తులుగా బోటు ఉండడంతో జనం ఎక్కువమంది ఎక్కేశారు. అయితే గజఈతగాళ్ళు కూడా 5 మంది ఉన్నారు. కానీ జనం ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. పాపికొండల నడుమ గోదారిలో బోటు మునిగిన సమయంలో బలంగా అలలను ఢీకొనడంతో బోటు 321 అడుగుల లోతులోకి వెళ్ళిపోయినట్లు భావిస్తున్నారు.
 
పాపికొండల ప్రాంతంలో గోదారి లోతుగా ఉండడం.. గల్లంతైనవారంతా బోటు కింద చిక్కుకున్న ప్రాణాలు విడిచారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తమ వారి కోసం బంధువులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి సురక్షితంగా తమ వారు బయటపడతారేమోనని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు బంధువులు. అయితే మూడురోజుల క్రితం మునిగిపోయిన బోటులోని జనం సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments