Webdunia - Bharat's app for daily news and videos

Install App

కె.ఎల్. యూనిర్సిటీలో గ్లోబల్ స్టూడెంట్స్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (19:31 IST)
ఆంధ్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్, కె.ఎల్. డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్త  ఆధ్వర్యంలో ఈనెల 11న  గ్లోబల్ స్టూడెంట్స్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్(GSEA) పోటీలను నిర్వహించనున్నట్లు  కె ఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాధరావు ప్రకటించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీలకు సంబందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో  సొంతగా వ్యాపారం చేయాలనుకునే యువ పారిశ్రామిక వేత్తల ప్రతిభను ప్రోత్సాహంచేందుకు ఈ అవార్డులను అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. 
 
 
ఈ అవార్డుల అర్హత పోటీలకు న్యాయనిర్ణేతలుగా శ్రీనివాస హెచ్.ఆర్.సి లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  సి.సురేష్ రాయుడు, బబుల్స్ హెయిర్ బ్యూటీ, ఓల్డ్ స్కూల్ ఇన్స్పిరేషన్స్ ఫౌండర్ వల్లూరుపల్లి స్మిత, హైదరాబాద్ ఏంజిల్స్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్ ఎస్. రత్నాకర్ వ్యవహరిస్తారని వెల్లడించారు. గ్లోబల్ అవార్డ్స్  ఫైనల్స్‌కు చేరుకోవడానికి విద్యార్థి స్థానిక, జాతీయ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో విద్యార్థులు వారి సహచరులతో పోటీపడతారని స్పష్టం చేశారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి, వారి లోపాలు తెలుసుకోవటానికి, అనుభవాలను పంచుకోవటానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 
 
 
విద్యార్థులు ఎంచుకున్న వ్యాపార, వ్యవస్థాపక ప్రయాణాన్ని న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించడానికి  ఒకసారి అవకాశం ఉంటుందని దీనిని ప్రతీ విద్యార్థి చాలెంజ్ గా తీసుకోవాలని సూచించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారు జాతీయ స్థాయిలో నిర్వహించే అవార్డు పోటీలకు అర్హత సాధిస్తారని స్పష్టం చేశారు. గత సంవత్సరం గ్లోబల్ స్టూడెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్(GSEA) జాతీయ ఫైనల్ పోటీలో  ఆంధ్రప్రదేశ్ నుండి గోపిరాజా గెలుపొంది, అవార్డును గెలుచుకున్నారని చెప్పారు.  గ్లోబల్ స్టూడెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్ పోటీలో  60 దేశాల నుండి సుమారు  1700 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని  చెప్పారు. 
 
 
విద్యార్థులు సలహాలు సూచనలు కోసం eoandhrapradesh@amail.com www.eonetwork.org సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు స్మిత, గ్లోబల్ స్టూడెంట్ ఎంట్రప్రెన్యూర్ అవార్డ్స్ చైర్ నీలిమ చల్లగుళ్ల, ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ ఫైనాన్స్ చైర్ రవి మూల్పూరు, ఆంద్రప్రదేశ్ ఎంట్రప్రెన్యూర్ ఆర్గనైజేషన్ మెంబెర్, మెంటర్ అశ్విన్ గణేష్, విశ్వవిద్యాలయం ఇంక్యూబేషన్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్, ఇంక్యూబేషన్ మెనేజర్  సౌరభ్ కుమార్ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments