Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఏడాది పాటు సామూహిక అత్యాచారం

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (12:21 IST)
బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పాతబస్తీలో ఏడాది నుంచి బాలికపై ఐదుగురు నిందితులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫతేదర్వాజకు చెందిన మహ్మద్‌ షఫిక్‌, మహ్మద్‌ సైఫ్‌అలీతో పాటు అదే బస్తీకి చెందిన మరో ముగ్గురు మైనర్లు స్నేహితులు. జల్సాగా తిరిగే వీరు వ్యసనాలకు బానిసయ్యారు. 
 
తొమ్మిదో తరగతి చదువుతున్న సైఫ్ అతని క్లాస్‌మేట్ అయిన ఓ బాలికతో పాటు ఏడో తరగతి చదువుతున్న ఆమె చెల్లెలితో చనువుగా వుండేవాడు. మాయమాటలతో లొంగదీసుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె చెల్లెలిపై కూడా కన్నేసి లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఇలా ఏడాదికాలం నుంచి జరుగుతోంది. 
 
రోజురోజుకు వీరి ఆగడాలు అధికం కావడంతో... ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారి సహాయంతో కమాటీపురా పోలీసులను ఆశ్రయించారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మేజర్లతోపాటు, ముగ్గురు మైనర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం