Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేది లేదు...కేంద్రం

Webdunia
శనివారం, 27 జులై 2019 (08:02 IST)
ఏపీలోని విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేది లేదని స్పష్టం చేసింది కేంద్రం. అదే విధంగా తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి లార్డ్ వెంకటేశ్వర ఎయిర్ పోర్టుగా మార్చే ఆలోచన కూడా లేదని తేల్చేసింది కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.

పార్లమెంట్ లో ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు మంత్రి హర్దీప్ సింగ్ పూరి. గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని కోరారు.  మార్చి 2017లో అప్పటి టీడీపీ సర్కార్.. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల పేరు మార్చాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరుతూ తీర్మానం చేసింది. విజయవాడ విమానాశ్రయం ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో ఉంది. ప్రస్తుతం ఉన్న రెండు విమానాశ్రయాల పేరు మార్చాలనే తీర్మానాలను అప్పటి సీఎం బాబు.. హయాంలో ఏపీ అసెంబ్లీలో చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వైసీపీ వచ్చింది. దీంతో ఆ తీర్మానం రద్దు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో విమాన ప్రయాణికుల రద్దీని తీర్చడానికి, గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు కోసం టిఎస్‌ఐఐసికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 'సైట్ క్లియరెన్స్' అనుమతి ఇచ్చిందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం దగ్గర ఏర్పాటు చేయబోయే విమానాశ్రయానికి 1 ఆఫ్ 70 భూవివాదం ఉందని తెలిపారు. ప్రతిపాదిత విమానాశ్రయం విషయంలో సైట్ క్లియరెన్స్ మంజూరు చేశామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments