Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యుత్ కొనుగోలుకి కేంద్రం క్లీన్ చీట్ ఇవ్వలేదు.. బాబుకి విష్ణు

విద్యుత్ కొనుగోలుకి కేంద్రం క్లీన్ చీట్ ఇవ్వలేదు.. బాబుకి విష్ణు
, బుధవారం, 17 జులై 2019 (20:10 IST)
విద్యుత్ కొనుగోలు భారత ప్రభుత్వం క్లీన్ చీట్ ఇవ్వలేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మీడియాతో మాట్లాడుతూ...
 
"ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి చంద్రబాబునాయుడు హయాంలో గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్యుత్ కొనుగోలు సంబంధించి భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి క్లీన్ చీట్ ఇవ్వలేదు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగితే విచారణ జరుగుతుంది.
 
 ఒప్పందాలను రద్దు చేస్తే రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేస్తారని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 39 వేల 280 కోట్లు కొనుగోలు చేశారు. ఇందులో నాలుగు కంపెనీలకే 69 శాతం కొనుగోలు చేయడం జరిగింది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ పవర్గ్రిడ్ కార్పొరేషన్ నుంచి 6 శాతం మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. 
 
ప్రైవేటు సంస్థలో కొనుగోలుకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోవాల్సిన ఆగత్యం ఏమిటో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఆంధ్రాలో రాజకీయ కక్ష సాధింపులు జరుగుతే అభివృద్ధి ఆగిపోతుందనే మాత్రమే కొనుగోలు విషయంలో కేంద్రం లేఖకాసంది. కొంతమంది తెలుగుదేశం నేతలు తిరిగి మేము బీజేపీతో మిత్రపక్షంగా ఉంటామని ఢిల్లీలో చర్చలు జరుపుతున్నామని మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు, వారి వంధిమాగదులు ప్రచారం చేస్తున్నట్లు టీడీపీతో జట్టుకట్టే ప్రసక్తే లేదు.
 
 తెలుగుదేశం మునిగిపోయే పడవ. దానికి  మరోసారి బిజెపి అవకాశం ఇవ్వదు. తెలుగు దేశం నుంచి వలస వెళ్లిపోతున్న నేతలను కాపాడుకోవడం కోసం తెలుగుదేశం బిజెపితో కలుస్తుందని చంద్రబాబు, టీడీపీ నేతలు కొత్త డ్రామాలకు తెర లేపారు. ఇది చంద్రబాబు మైండ్ గేమ్. తెలుగుదేశం పార్టీతో  పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదు. 
 
ఐదేళ్లు రాయలసీమను నట్టేట ముంచిన చంద్రబాబు రాయలసీమలో రెండో రాజధాని మేము డిమాండ్ చేసినపుడు  ఎగతాళిగా కోడుకు లోకేష్ తో కలిసి డ్రామాలాడినారు.
 
రాయలసీమ ప్రజలను ఇంకా అవమానించడం, తక్కువ చేసి మాట్లాడటం మానడం లేదు. నిన్న చినరాజప్ప రాయలసీమ రీడీలు అని మాటల మాట్లడుతున్నారు. తక్షణం రాయలసీమ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పమని బిజెపి డిమాండ్ చేస్తుంది. 
 
2014 ఎన్నికల్లో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. మోడీ ఇచ్చిన 10 శాతం ఈబిసి రిజర్వేషన్లలో 5 శాతం ఇచ్చి, కాపులకు రిజర్వేషన్ అంటూ కొత్త మోసానికి తెరలేపారు" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌కు ఇంటర్ విద్యార్థులు కృతజ్ఞతలు