Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ఎందుకంత ఆక్రోశం : గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (11:02 IST)
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత ఆక్రోశం అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు దేనికోసంచేస్తోందని ప్రశ్నించారు. 
 
అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ సమయం ప్రతిపక్షానికే ఇచ్చామని.. అయినా సీఎం మాట్లాడుతున్న సమయంలో అడుగడుగునా అడ్డు తగిలారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని.. వారు వ్యవహరిస్తోన్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రాంతీయ విద్వేషాలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 
 
రాజధాని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కావడం చాలా సంతోషంగా ఉందని శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటుపై ప్రతి కమిటీలోనూ స్పష్టంగా చెప్పారన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో చినుకు కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారన్నారు. 
 
శ్రీబాగ్ ఒడంబడిక చదువుతుంటే తమ కంట కన్నీరు వచ్చిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు హైకోర్టు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలుస్తున్నారన్నారు. రాయలసీమ వాసులకు చెరువులు ద్వారా సాగునీరు అందించాలని  ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments