Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులు అందుకు రెడీ.. కానీ మోదీ, అమిత్ షా అడ్డుపడుతున్నారు..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. ప్యాకేజీల విషయంలో రోజుకో మాట మాట్లాడటంతో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎంత పోరాడిన

Webdunia
గురువారం, 10 మే 2018 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం.. ప్యాకేజీల విషయంలో రోజుకో మాట మాట్లాడటంతో ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలగిన సంగతి తెలిసిందే. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎంత పోరాడినా, అవిశ్వాస తీర్మానం చేపట్టినా ఫలితం శూన్యమైంది. దీంతో బీజేపీ రాజకీయ ఎత్తుగడలకు ప్రణాళిక వేసుకుంటోంది. 
 
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని పావుగా చేసుకుని ఏపీలో మద్దతు కూడగట్టుకునేందుకు సై అంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు చాలామంది ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు సై అంటున్నా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు అడ్డుపడుతున్నారని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. మోదీ, అమిత్ షా వైఖరితోనే ఏపీకి అన్యాయం జరుగుతోందని తెలిపారు. 
 
గతంలో పాస్ పోర్టు రావాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉండేదని, ఇప్పుడు మాత్రం రోజుల్లోనే చేతికందుతోందని చెప్పారు. ఎలాగంటే..? కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ మహిళా నేత సుష్మాస్వరాజ్‌ చొరవతోనేనని గల్లా జయదేవ్ కొనియాడారు. 
 
గురువారం గుంటూరులో రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రం ప్రారంభం కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఇక్కడి ప్రజల సౌకర్యార్థం ఓ పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖ రాయగానే సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారని కితాబిచ్చారు. సుష్మా స్వరాజ్ చొరవతోనే ఇంత త్వరగా పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments