Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డిపై నటుడు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు?

రాజకీయాలు నాకు కొత్తేమీ కాదు. ఎంతోమంది అనుభవం ఉన్న రాజకీయ నేతలతో కలిసి పనిచేశాను. ప్రజా సేవ చేయడం నాకెంతో ఇష్టం. సినిమాల్లో నటిస్తూనే ప్రజలకు సేవ చేస్తూ వచ్చాను. అందుకే బిజెపిలో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది. ప్రధాని చేసిన అభివృద్థి కార

Webdunia
గురువారం, 10 మే 2018 (17:46 IST)
రాజకీయాలు నాకు కొత్తేమీ కాదు. ఎంతోమంది అనుభవం ఉన్న రాజకీయ నేతలతో కలిసి పనిచేశాను. ప్రజా సేవ చేయడం నాకెంతో ఇష్టం. సినిమాల్లో నటిస్తూనే ప్రజలకు సేవ చేస్తూ వచ్చాను. అందుకే బిజెపిలో నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించింది. ప్రధాని చేసిన అభివృద్థి కార్యక్రమాలే నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తాయి. కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎక్కువమంది ఉన్న మాట వాస్తవమే. అది నాకు తెలుసు. ఇప్పుడు ఎపిలో ప్రత్యేక హోదా ఉద్యమం జరుగుతోంది. అయితే కేంద్రం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
 
హోదా గురించి నేను మాట్లాడను. బిజెపి అధినాయకత్వం చూసుకుంటుంది. కానీ కొంతమంది నేతలు ఆవేశపూరితంగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా సీనియర్ నేతలను విమర్శిస్తున్నారు. ఇది తప్పు. అందులో జగన్మోహన్ రెడ్డి మొదటి వ్యక్తి. జగన్ ఏదిపడితే అది మాట్లాడేస్తున్నారు. రాజకీయంలో ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. అది ముందు తెలుసుకోవాలి. మనపైన ఆరోపణలు వస్తే వాటిని సరిదిద్దుకోవాలి. కానీ జగన్ అది చేయడం లేదు. 
 
తనపై పడిన బురదను తుడుచుకోవాలే గానీ... ఇంకా బూడిదను పూసుకోకూడదు. జగన్‌కు ఆ విషయం తెలియడం లేదు. జగన్ గారు.. తెలుసుకోండి.. రాజకీయాలు నేర్చుకోండి అంటూ సాయికుమార్ జగన్ పైన తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని, కానీ కొన్ని మార్పులు ఆయనలో రావాలంటున్నారు సాయికుమార్. సాయికుమార్ ఒకవైపు జగన్‌ను తిడుతూ మరోవైపు పొగుడుతూ ఉండటంతో వైసిపి కార్యకర్తలకు అసలేమీ అర్థం కావడం లేదు. సాయికుమార్ తిడుతున్నారా.. పొగుడుతున్నారా తెలియక తలలు పట్టుకుంటున్నారు. మొత్తంమీద సాయికుమార్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments