ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు వుండాలన్నదే ఏపీ ప్రభుత్వ లక్ష్యం
అమరావతి : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రగతిపై రూపొందించిన ప్రత్యేక సంచికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పుస్తకావిష్క
అమరావతి : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రగతిపై రూపొందించిన ప్రత్యేక సంచికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామీణ గృహనిర్మాణ శాఖమంత్రి కాలవ శ్రీనివాసులు, హౌసింగ్ ఎమ్‌డి కాంతిలాల్ దండే మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.
వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 10 లక్షల ఇళ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో కలిపి వచ్చే ఏడాదికి 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావలన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లు ప్రారంభించేందుకు జూన్ నెల నుండి ప్రతి నెలా రాష్ట్రంలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు వుండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామీణ గృహనిర్మాణశాఖ ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని మంత్రి కాలవ శ్రీనివాసులు ఒక ప్రకటన రూపంలో తెలియజేశారు.
రాష్ట్రంలో గడచిన ఆర్థిక సంవత్సరం(2017-18)లో రూ.3787 కోట్ల ఖర్చుతో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డుని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహనిర్మాణ శాఖమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఒక సంవత్సర కాలంలో 3.00 లక్షల పైచిలుకు ఇళ్లు పూర్తిచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలో 10 లక్షల ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.
2022 నాటికి రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దీనిలో భాగంగా 2018-19 సంవత్సరానికి గృహనిర్మాణశాఖ బడ్జెట్‌ను భారీగా పెంచడంతో పాటు సుమారు 10వేల కోట్ల నిధులను అందుబాటులో వుంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన వుందని మరోసారి రుజువైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్న సహాయానికి అదనంగా రాష్ట్రం ఎక్కువ మొత్తాన్ని వివిధ ఆర్ధిక సంస్ధల ద్వారా నిధులు సమకూర్చుకుంటూ గృహనిర్మాణ సంస్థ ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ నిబంధనల్లో చేపట్టిన మార్పుల కారణంగా గత ఏడాది కాలంగా రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగవంతమయ్యిందన్నారు. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు ఇందుకు దోహదం చేశాయని మంత్రి కాలువ తెలిపారు.
ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతమయ్యేందుకు తీసుకున్న నిర్ణయాలు :
* గతంలో ఇంటి నిర్మాణానికి 550 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు మాత్రమే అనుమతి వుండగా, ప్రస్తుతం దీనిని 750 అడుగుల వరకు పెంచడం జరిగింది.
* గ్రామాల్లో ఒకే కుటుంబంలో అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు పక్కపక్కనే ఇళ్లు నిర్మించుకున్నట్లయితే వారు ఒకే గోడను ఆనుకొని వేర్వేరు ఇళ్లు నిర్మించుకునేలా నిబంధనలు సడలించడం జరిగింది.
* గతంలో మంజూరై అసంపూర్తిగా మిగిలిన పక్కా ఇళ్ల నిర్మాణాలకు అదనపు సబ్సిడీగా రూ.25 వేలు మంజూరు చేయడం జరిగింది.
* ఏడాదిలో 5,51,035 ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది.
* ఒకే సంవత్సరంలో రూ.3,787 కోట్లతో 3.15 లక్షల ఇళ్ల నిర్మాణాలు.
* ఒకేసారి లక్ష ఇళ్లలో గృహప్రవేశాలు.
* సామూహిక శంకుస్థాపన కార్యక్రమాలు.
* మౌళిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లు.
* పారదర్శకంగా బిల్లుల చెల్లింపు.
* పేదలకు బహుళ అంతస్థుల భవనాలు.
* అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు, క్షేత్రస్థాయిలో తనిఖీలు.