Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగీ జ్వరంతో ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 71 యేళ్లు. రెండ్రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చ

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (08:35 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 71 యేళ్లు. రెండ్రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన మంగళవారం అర్థరాత్రి కన్నుమూశారు. 
 
రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న గాలి ముద్దుకృష్ణమ నాయుడి ఆరోగ్యం బాగానే కుదుటపడింది. అయితే, రెండు రోజుల క్రితం ఆయనకు డెంగీ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స చేసినప్పటికీ.. ప్రాణాలు కాపాడలేక పోయారు. ఫలితంగా టీడీపీ ఓ సీనియర్ నేతను కోల్పోయింది. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకునిగా పలు పదవులు చేపట్టారు. 
 
ముద్దుకృష్ణమ నాయుడు 1947 జూన్‌ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలో జి.రామానాయుడు, రాజమ్మ దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన.. 1983లో ఎన్.టి. రామారావు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. పుత్తూరు నుంచి ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకెక్కారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్థి ఆర్.కె రోజా చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం తెదేపా ఎమ్మెల్సీగా సేవలందిస్తున్నారు. గాలి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments