Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మో చిత్తా నక్షత్రంలో పుట్టిన మహిళలు ఇలా వుంటారట?

చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతి. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు తన నిర్ణయమే సరైందని వాదిస్తారు. ఇతరుల సాయం పొందుతారు. కానీ ఇతరులకు సాయం చేసే విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తారు. ప్రయోజనం లేని చర్చలు, కోపతాపాలు వీరి నైజం. ఆవేశాలతో చేదు అనుభవాలనే మిగు

Advertiesment
అమ్మో చిత్తా నక్షత్రంలో పుట్టిన మహిళలు ఇలా వుంటారట?
, మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (16:42 IST)
చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతి. ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు తన నిర్ణయమే సరైందని వాదిస్తారు. ఇతరుల  సాయం పొందుతారు. కానీ ఇతరులకు సాయం చేసే విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తారు. ప్రయోజనం లేని చర్చలు, కోపతాపాలు వీరి నైజం. ఆవేశాలతో చేదు అనుభవాలనే మిగుల్చుకుంటారు.  తాను చేసిన సహాయాన్ని భూతద్దంలో చూపించేందుకు ప్రతిసారీ ప్రయత్నిస్తారు. 
 
భాగస్వామ్యుల సహకారం లేనిదే జీవితంలో రాణించలేరు. స్థిరాస్థులు వంశపారంపర్యంగా అందుతుంది. సొంతంగానూ ఆస్తులు కూడబెట్టుకుంటారు. రాజకీయ రంగం వీరికి కలిసివస్తుంది. ఇంకా సాంకేతిక, వైద్య రంగాల్లో ఆర్థిక పరమైన వ్యాపారాల్లో మంచి పట్టు సాధిస్తారు. మంచి సలహాదారులు చెంతనే ఉండటం ద్వారా అధిక లాభాలు పొందుతారు.
 
మహిళలు ఎలా వుంటారంటే?
చిత్తా నక్షత్రంలో జన్మించిన జాతకులు.. కారణం లేకుండానే కోపానికి గురవుతారు. కానీ ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నించడానికి వెనుకాడరు. అలాగే చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళా జాతకులు మధ్య వయస్సు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి.
 
అందం, ఇతరులను ప్రేమించడం, ఆధిపత్యం వీరికి సొంతం. ఉన్నత పదవులను అలంకరిస్తారు. కానీ సులభంగా ఇతరులను నమ్మేస్తారు. ఇదే వీరి బలహీనత. 2018లో తప్పకుండా స్థిరాస్తిని పొందుతారు.
 
ఈ జాతకంలో పుట్టిన వారు దుర్గాదేవిని పూజించడం ద్వారా అనుకూల ఫలితాలను పొందవచ్చు. ప్రకాశవంతమైన రంగుల దుస్తులను ధరించవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాశివరాత్రి రోజున శివకళ్యాణం చేయిస్తే?