Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ సమయంలో మహిళల సమస్యకు పరిష్కారం...

చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుము నొప్పిగా ఉంటుంది. మరి వాటిని

ఆ సమయంలో మహిళల సమస్యకు పరిష్కారం...
, మంగళవారం, 16 జనవరి 2018 (21:27 IST)
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుము నొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 
 
1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 
 
2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి ఓసారి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతు దిగుతుంటే హాయిగా ఉంటుంది. అల్లం, పిప్పరమెంట్, లెమన్.... ఇలా రకరకాల హెర్బల్ టీలను తాగవచ్చు. వీటిలోని ఔషధ గుణాలు అలసట పోగొట్టడమే కాకుండా నొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. 
 
3. గ్లాసు వేడి నీటిలో కొద్దిగా అల్లం తరుగు వేసి బాగా మరిగించాలి. దీన్ని వడకట్టి తేనె కలిపి రోజులో రెండుసార్లు తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
 
4. ఉప్పు, నూనె ఎక్కువగా ఉంచే పదార్ధాలను తీసుకోవడం ఈ సమయంలో మంచిది. వీటి బదులుగా తాజాపండ్లను భోజనంలో చేర్చుకోవడం మంచిది. అరటిపండును తరచు తీసుకోవాలి. ఇందులోని మెగ్నీషియం ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. తాజా ఆకు కూరల ద్వారా శరీరానికి కావల్సినంత ఇనుము కూడా అందుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవిసె గింజలతో మహిళల్లో ఆ సమస్య వుండదట..