ఏపీలో త్వరలోనే పూర్తి స్థాయి లాక్ డౌన్ ?

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:36 IST)
రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుండడం, రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడం అలాగే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు.

నేటి నుండి కిరాణా షాపులకు, ప్రజల నిత్య అవసరాల కోసం, ప్రజల రోజువారీ కార్యక్రమాల నిమిత్తం మధ్యాహ్నం 12 వరకు అనుమతిని ఇచ్చింది. అనంతరం 12 తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని ఆదేశాలు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రజలు 12 తర్వాత రోడ్లపైకి రాకూడదని నిబంధనలు విధించారు. మరో వైపు పోలీసు అధికారులు సైతం ప్రజా రక్షణ కొరకు 12 తర్వాత కర్ఫ్యూ సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
 
అయితే నరసరావుపేట ,రొంపిచర్ల మండలాలలో మాత్రం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకే ప్రజల నిత్య అవసరాల కోసం, వ్యాపారాలు, ఇతర పనులకు అనుమతిస్తున్నారు. అనంతరం ఉదయం 8 నుండి రోజంతా పూర్తిగా  కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

రొంపిచర్ల, నరసరావుపేట మండలాలలోని పలు గ్రామాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతుండడం, కరోనా మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఇలా కర్ఫ్యూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎస్‌ఐ పి.హజరత్తయ్య ఆధ్వర్యంలో ఈ కర్ఫ్యూ సరిగ్గా జరిగేలా 8 తర్వాత ఎవరూ రోడ్లపై కనపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఇదే తరహాలో కర్ఫ్యూ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న కరోనా విజృంభణకు కళ్లెం వేసే దిశలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా లాక్ డౌన్ అంటే ప్రజలు ఇబ్బంది, కంగారు పడతారని కొద్ది రోజులు కర్ఫ్యూ విధించి ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలులోకి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కరోనా తీవ్రత తగ్గించి  ప్రజల్ని  కాపాడాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని  ఆరోగ్యనిపుణులు సూచిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏమౌతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల

Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్

శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే

Ravi Basrur: కటాలన్ కు సలార్ ఫేం రవి బస్రూర్ మ్యూజిక్

Satya: సత్య, రియా సింఘా పై సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments