Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబ‌రు 7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (17:32 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుక‌బ‌డిన వ‌ర్గాల భ‌క్తుల‌కు అక్టోబ‌రు 7 నుండి 14వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వ ద‌ర్శ‌నం చేయించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. వీరికి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నంతోపాటు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేయిస్తారు. 
 
హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసేందుకు, మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ‌ ద్వారా స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ సహకారంతో టిటిడి మొద‌టి విడ‌త‌లో రూ.25 కోట్ల‌తో 13 జిల్లాల్లో 502 ఆల‌యాల‌ను నిర్మించిన విష‌యం తెలిసిందే. ఈ ఆల‌యాలు నిర్మించిన వెనుక‌బ‌డిన‌ ప్రాంతాల నుండి బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో భ‌క్తుల‌ను ఆహ్వానించి శ్రీ‌వారి ద‌ర్శనం చేయించ‌డం జ‌రుగుతుంది. ఒక్కో జిల్లా నుండి 10 బ‌స్సులు ఏర్పాటుచేసి భ‌క్తుల‌ను ఉచితంగా తిరుమ‌ల‌కు తీసుకురావ‌డం జ‌రుగుతుంది. తూర్పుగోదావ‌రి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో 20 బ‌స్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బ‌స్సులో ఇద్ద‌రు స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు మార్గమధ్యంలో స్థానిక దాతల స‌హ‌కారంతో  ఆహార పానీయాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది.

సంబంధిత వార్తలు

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments