Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై నాలుగు నెలలే, పక్కింటి యువకుడితో పరిచయం, భర్త అడ్డొస్తున్నాడని కారుతో ఢీకొట్టి..

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (17:57 IST)
యువకుడి పరిచయం ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. పెద్దలు చేసిన వివాహం.. పెళ్ళయి సరిగ్గా నాలుగు నెలలే. అంతలోనే పక్కింటి కుర్రాడితో పరిచయం. నిత్యం బిజీ ఉద్యోగంలో భర్త. ఇంకేముంది యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత చివరకు కటాకటాల పాలైంది.
 
నెల్లూరు పట్టణానికి చెందిన రామారావుకు అదే ప్రాంతానికి చెందిన సుగుణకు నాలుగునెలల క్రితం వివాహమైంది. రామారావు స్థానికంగా ఉన్న ఒక సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేసేవాడు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకే ఆఫీస్‌కు వెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. పెళ్ళయిన తరువాత కూడా ఇదే పరిస్థితి.
 
దీంతో భార్య సుగుణ ఇంటిలో ఒంటరిగా ఉండేది. నెల్లూరు పట్టణం ప్రధాన ద్వారం సింహపురి వద్ద వీరి నివాసముండేవారు. సుగుణకు తన ఇంటికి పక్కనే ఉన్న డిగ్రీ విద్యార్థి రామ్ పరిచయమయ్యాడు. ఖాళీ సమయాల్లో రామ్ ఆమెతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది.  
 
యువకుడితో సంబంధం సాగిస్తున్న విషయం కాస్తా స్థానికుల ద్వారా రామారావుకు తెలిసిపోయింది. తన అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిపోవడంతో సుగుణ, రామ్‌తో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. రామారావును హత్య చేసేందుకు అతని స్నేహితులతోనే రామ్ బేరం కుదుర్చుకున్నాడు. రామ్‌కు ఫుల్లుగా మద్యం తాగించి కారుతో ఢీకొట్టి చంపేయాలని నిర్ణయించుకున్నారు. 
 
అనుకున్న ప్రకారం మద్యం తాగించారు స్నేహితులు. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న రామారావును వైన్ షాప్‌కు వెళ్ళి మందు బాటిల్ తీసుకురమ్మని చెప్పారు. అప్పటికే కారుతో సిద్థంగా ఉన్నాడు రామ్. రామారావు కిందకు దిగి బైక్ తీసుకుని కొద్దిదూరం వెళ్ళగానే తన కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
 
అయితే రామారావు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు రామారావు నుంచి ఫిర్యాదు తీసుకుని విచారించగా భార్యతో పాటు రామ్ వ్యవహారం బయటపడింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments