Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్మిళ పార్టీలోకి మాజీ అధికారులు, ఎవరెవరు ఉన్నారంటే?

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (18:13 IST)
షర్మిళ పెట్టబోయే పార్టీకి మాజీ బ్యూరోక్రాట్స్ మద్ధతు పెరుగుతోందా? వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో పనిచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఇప్పుడు షర్మిళ పార్టీవైపు చూస్తున్నారా? తమ రాజకీయ జీవితాన్ని ఆరంభించేందుకు షర్మిళ స్థాపించబోయే పార్టీని వేదికగా చేసుకుంటున్నారా..? ఇంతకీ ఆ మాజీ అధికారులు ఎవరు..?
 
తెలంగాణాలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న షర్మిళ కొత్త పార్టీలో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రతిరోజు వందలమంది షర్మిళకు మద్దతు తెలుపుతున్నారు. ఆమె పెట్టబోయే కొత్త పార్టీలో చేరుతామని ప్రకటించి వెళ్ళిపోతున్నారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోటస్ పాండ్‌లో వైఎస్ అభిమానుల సందడి కనిపిస్తోంది. అయితే సాధారణ కార్యకర్తల దగ్గర నుంచి రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ వరకు షర్మిళ పెట్టబోయే పార్టీలో పనిచేసేందుకు సిద్థపడుతున్నారు.
 
తాజాగా మాజీ డిజిపి స్వరణ్ జిత్ సేన్ సైతం షర్మిళ కొత్త పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వరణ్ జిత్ సేన్ సతీమణి అనితా సేన్ షర్మిళను కలిశారు. దాదాపు గంట పాటు అనితా సేన్ సమావేశమయ్యారు. అందరికీ తెలిసి కలిసిన వ్యక్తుల్లో మాజీ డిజిపి ఒకరైతే ఇంకా పదవీ విరమణ చేసిన చాలామంది షర్మిళలతో టచ్‌లో ఉన్నారట. ఎవరినీ నొప్పించకుండా అందరినీ పార్టీలో కలుపుకు పోవాలన్న ఆలోచనలో ఉన్నారట షర్మిళ. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments