Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (17:35 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెటిరోలో దొరికిన సొమ్మంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. రూ. 147 కోట్లు కాదని ఇంకా వేల కోట్లలో దాచారన్నారు.

ఇదంతా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో దోచిందేనన్నారు. సీఎం జగన్ మల్లె పూలు కూడా అమ్ముకుంటారని ఎద్దేవా చేశారు. విశాఖలో వివిధ కార్యాలయాలను రూ. 25 వేల కోట్లకు  తాకట్టు పెట్టారని విమర్శించారు.

ఏ ప్రజలు అయితే అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారో.. అదే ప్రజలు కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. జైల్లో చిప్ప కూడు తిన్నవారికి పాలనపై అవగాహన ఏం ఉంటుందన్నారు.

ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు.

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు మద్యం చాటున ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. సీఎం యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అయ్యన్న ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments