Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో తమ్ముడితో గొడవ పడిన మాజీ సిఎం

వద్దూ.. వద్దంటున్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేందుకు తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తుండటం అన్నయ్య మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో కిషోర్ చేరుతున్నట్లు మొదట్లోనే ప్రచారం కావడంతో కిరణ్ హెచ్చరించ

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (16:23 IST)
వద్దూ.. వద్దంటున్నా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేందుకు తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తుండటం అన్నయ్య మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం నచ్చలేదు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో కిషోర్ చేరుతున్నట్లు మొదట్లోనే ప్రచారం కావడంతో కిరణ్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడంటే కిరణ్‌‌కు అస్సలు ఇష్టముండదు. ఇద్దరి మధ్యా వైరం ఎప్పటి నుంచో ఉంది. ఆ పార్టీ నేతలన్నా కూడా కిరణ్‌కు ఇష్టం ఉండదు. అలాంటి పార్టీలోకి కిషోర్ కుమార్ రెడ్డి వెళుతుండటం ఏ మాత్రం మాజీ సిఎంకు నచ్చలేదు. 
 
గత రెండు రోజుల నుంచి చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కిషోర్ కుమార్ రెడ్డి. అయితే వెళ్లొద్దని ఎంత చెప్పినా కిషోర్ వెళుతుండటంతో ఆయనపై అలిగారట కిరణ్. అస్సలు మాట్లాడటం మానేశారట. ఈరోజు సాయంత్రం గాని లేక రేపుగాని చంద్రబాబు సమక్షంలో కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరి తెదేపాలో చేరిన తర్వాత అన్నయ్య అలక మెల్లమెల్లగా తగ్గిపోతుందేమో?

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments