Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (11:50 IST)
మాజీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరా తీశారు. వైద్యులకు ఫోన్ చేసి కోడెల చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోడెల ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఆయన అల్లుడు డాక్టర్ పూనాటి మనోహర్‌తో ఫోనులో మాట్లాడిన చంద్రబాబు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురికావడం కారణంగా గుండెపోటు వచ్చిందని తెలిపిన డాక్టర్ మనోహర్ తెలిపారు.
 
గతంలో ఒకసారి కోడెలకు గుండెపోటు వచ్చిందని అయితే అప్పుడు స్టంట్ వేశామని ఆయన వివరించారు. ప్రస్తుతం శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపిన మనోహర్.. మరో 48 గంటలు గడిచిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటే సర్జరీ ద్వారా యాంజియోగ్రామ్ చేయడానికి  ప్రయత్నిస్తామని తెలిపారు.

అలాగే, కోడెలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అవసరమైతే హైదరాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు తరలించాలని డాక్టర్ మనోహర్‌కు  చంద్రబాబు సూచన చేశారు. ప్రస్తుతం గుంటూరులోని శ్రీ లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  ఐసీయూలో కోడెల చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోడెల అభిమానులు గుంటూరు, నరసరావుపేట, సత్తెనపల్లి తదిత ప్రాంతాల నుంచి ఆస్పత్రి వద్దకు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments