Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఆరోగ్యం బాగాలేదని వెళతూ కారు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (13:30 IST)
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భవ్య పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను వేగంగా వస్తున్న మారుతి ఆల్టో(AP 09A Z7703 ) వెనక నుండి ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమారులు పరంజ్యోతి, థిప్పెన్ మృతి చెందగా.. కోడలు చైతన్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఆమెను పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న థిప్పెన్... ట్రావెల్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే తెనాలిలో ఉంటున్న తన తల్లి పరంజ్యోతికి అనారోగ్యం కారణంగా హైదరాబాదు నుండి తెనాలికి కుటుంబంతో కలిసి కారులో బయలుదేరాడు థిప్పేన్.
 
పొగ మంచు కారణంగా రహదారి సక్రమంగా కనిపించక పోవటంతో దాచేపల్లి భవ్య పెట్రోల్ బంక్ వద్ద ముందు వైపు వెళ్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను పిడుగురాళ్ల ఆసుపత్రి తరలించారు. దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments