Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యురాలిని బాత్రూంలో వీడియోలు తీసిన ప్రముఖ పార్టీ కార్యకర్తలు?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (15:41 IST)
ఆమె ఒక వైద్యురాలు. చిత్తూరుజిల్లా గంగాధరనెల్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు. గత డిసెంబర్ నెల నుంచి ఆమె అక్కడ పనిచేస్తోంది. అయితే కరోనా సమయంలో మిగిలిన వ్యాధులను చెకప్ చేసుకోవడానికి ఎవరూ ఆసుపత్రికి రావద్దని ఆసుపత్రిలో బోర్డు పెట్టింది.
 
ఇది కాస్త ఓ ప్రముఖ పార్టీ కార్యకర్తలకు చిర్రెత్తుకొచ్చింది. అందులోను కీలక నాయకుడు అనుచరులుగా వున్న ఇద్దరు  వైద్య అధికారిణిపై అంతెత్తు లేచారు. అన్ని రకాల చికిత్సలు చేయాలని ఆమెపై బూతుల పురాణం మొదలుపెట్టారు. మేమెవరో తెలుసా.. మా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకపోతే నీ అంతు చూస్తామంటూ వారిద్దరూ రెచ్చిపోయారు.
 
తనను ఆ పార్టీకి చెందిన కార్యకర్తుల వేధిస్తున్నారంటూ సహచర సిబ్బందికి చెప్పుకుంది వైద్యురాలు. అలాగే కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసింది. రెండునెలలుగా ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే తమపై ఫిర్యాదు చేస్తావా అంటూ ఆమెను బదిలీ చేశారు. అంతకుముందు ఈ ఇద్దరు వైద్యశాలలో ఆమె బాత్రూంకు వెళ్ళినప్పుడు ఫోటోలు తీయడం.. అసభ్యకరంగా మాట్లాడడం వీడియోలు ఉన్నాయని బెదిరించారు.
 
దీంతో ఆ బాధితురాలు న్యాయం కావాలంటూ మీడియాను ఆశ్రయించింది. దీనిపై దళిత సంఘాలన్నీ ఐక్యమై పోరాటం చేసేందుకు సిద్థమవుతున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి వారి వేధింపులు కొనసాగుతున్నా తనకు న్యాయం జరగడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్

అజిత్ కుమార్, త్రిష మూవీ విడాముయర్చి నుంచి లిరిక‌ల్ సాంగ్

డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూశాక నన్ను అడివిశేష్, రానా తో పోలుస్తున్నారు : ప్రశాంత్ కృష్ణ

క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్న సమంత.. వినాయక పూజ..?

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments