Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయమాటలతో రూ.4.88 లక్షలు... మహిళ చేతిలో మోసపోయిన డాక్టర్

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ చేతిలో ఓ డాక్టర్ మోసపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ తన ఖాతాలో డబ్బులు వేయించుకుని వైద్యుడిని మో

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (10:16 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ కిలేడీ చేతిలో ఓ డాక్టర్ మోసపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ తన ఖాతాలో డబ్బులు వేయించుకుని వైద్యుడిని మోసం చేసిన సంఘటనపై పటమట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 
 
కృష్ణా జిల్లా, విజయవాడ, అయ్యప్పనగర్‌కు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి వైద్యుడిగా పని చేస్తున్నాడు. రెండు నెలల కిందట ఆయనకు ఫేస్‌బుక్‌లో లండన్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. రెండు నెలలుగా ఇద్దరు ఫేస్‌బుక్‌లో ఛాటింగ్‌ చేసుకుంటున్నారు. లండన్‌ నుంచి విజయవాడ వస్తున్నానని ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని ఆ మహిళ ఈ నెల 15న కృష్ణమూర్తికి ఫోన్‌ చేసి చెప్పింది. 
 
ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చేందుకు తన దగ్గర ఇండియన్‌ కరెన్సీ లేదని చెప్పింది. ఆమె విమానాశ్రయంలో నిలబడి ఉందని, 20 వేల పౌండ్లు ఉన్నాయని మరో వ్యక్తితో కూడా ఫోన్‌ చేయించి మాట్లాడించింది. తన ఖాతాకు ఇండియన్‌ కరెన్సీ పంపించాలని కోరింది. 
 
ఆ మాటలు నమ్మిన కృష్ణమూర్తి 15, 16 తేదీల్లో మొత్తం రూ.4.88 లక్షలు ఆమె చెప్పిన బ్యాంకు ఖాతాలో వేశారు. ఆ తర్వాత ఆ మహిళ నుంచి ఎటువంటి సమాచారం లేదు.. ఫోన్‌ లేదు. దీంతో మోససోయినట్లు గ్రహించిన ఆయన పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments