Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడే కదా అని ఇంటికి పిలిస్తే తన భార్యనే లొంగదీసుకున్నాడు, ఆ తర్వాత?

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (11:36 IST)
ప్రాణ స్నేహితుడు కామాంధుడవుతాడని గమనించలేకపోయాడతను. స్నేహితుడే కదా అని తరచూ తన ఇంటికి పిలవడం, పార్టీలు చేసుకోవడం చేస్తుండేవాడు. ఇలా తరచూ ఇంటికి వస్తున్న అతడి స్నేహితుడు తన ఫ్రెండ్ భార్యనే లొంగదీసుకున్నాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత స్నేహితుడు అడ్డుగా వున్నాడని అతడిని హత్య చేసాడు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... గుత్తి ఆర్.ఎస్ లోని తోళ్లషాపులో నివాసం వుంటున్న అశోక్ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి యోగి అనే వ్యక్తి మంచి స్నేహితుడు. దాంతో తరచూ తన స్నేహితుడిని ఇంటికి పిలుస్తుండేవాడు. ఈ క్రమంలో యోగి తన స్నేహితుడు అశోక్ భార్యపై కన్నేసాడు. మెల్లగా ఆమెను లొంగదీసుకున్నాడు.
 
స్నేహితుడు అశోక్ ఇంట్లో లేనప్పుడు ఆమెతో గడిపేవాడు. భార్యతో స్నేహితుడు సన్నిహితంగా వుండటాన్ని చూసి షాక్ తిన్నాడు. ఆ తర్వాత భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. కానీ ఆమె మాత్రం భర్త అశోక్ కంటే యోగినే కావాలనుకుంది.
 
ఆ ప్రకారం భర్త హత్యకు పక్కా ప్రణాళిక వేసి ప్రియుడిని రంగంలోకి దింపింది. దాంతో అతడు స్నేహితుడు అశోక్ ను పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి పూటుగా మద్యం తాగించాడు. అనంతరం కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసాడు. తన కుమారుడి హత్యపై అతడి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి వాస్తవాన్ని వెలికి తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments