Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు అమెరికా హెచ్చరిక : రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారో...

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (11:30 IST)
భారత్‌కు అమెరికా గట్టివార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయరాదని వార్నింగ్ చేసింది. తమ హెచ్చరికలను ఉల్లంఘిస్తే మాత్రం ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. 
 
కాగా, రష్యా - భారత్ దేశాల మధ్య ఏర్పడిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా రూ.వందల కోట్ల విలువైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాకు అమెరికా రూపంలో అడ్డంకులు తగులుతున్నాయి. 
 
ఈ అత్యాధునిక మిసైల్ సిస్టమ్‌ను రష్యా నుంచి కొనేందుకు గతంలోనే ఇండియా డీల్ కుదుర్చుకోగా, తాజాగా విడుదలైన యూఎస్ కాంగ్రెస్ రిపోర్టు, ఇండియా ఆయుధాలు కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. 
 
యూఎస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఆర్ఎస్ (కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్) తన తాజా నివేదికలో భారత్ తన రక్షణ విధానాన్ని మార్చుకోవాలని, సంస్కరణలు తీసుకు రావాలని సూచించింది.
 
మరింత సాంకేతికతను అందుకోవాలన్న ప్రయత్నాలు కూడదని, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధిని మరింతగా పెంచాలని, రక్షణ విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. 
 
"రష్యా తయారు చేసుకున్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు మేము వ్యతిరేకం. వీటిని ఇండియా కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల చట్టానికి ఇండియా - రష్యా డీల్ వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం" అని సీఆర్ఎస్ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments