Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన-బీజేపీలు విడిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు.. ఉండవల్లి అరుణ్ కుమార్

Webdunia
మంగళవారం, 24 మే 2022 (16:23 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ చీఫ్‌ చంద్రబాబు మాటలు బట్టి టీడీపీ జనసేన మధ్య పొత్తులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అయితే, ఏపీలో సీఎం జగన్ కొనసాగాలని బీజేపీ భావిస్తే పొత్తులుండవని జోస్యం చెప్పారు.
 
ఏపీలో రాజకీయం ఎలా ఉన్నా మనకేంటనే భావనలో బీజేపీ ఉంటే పొత్తులుంటాయని ఉండవల్లి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండదనే భావిస్తున్నానని వెల్లడించారు. ఇక, జనసేన-బీజేపీలు విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని బాంబ్‌ పేల్చారు ఉండవల్లి.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. గత కొంతకాలంగా ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై మాత్రం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
 
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అంతా ఏకం కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా.. టీడీపీ నేతలు కూడా పొత్తులకు సై అనే విధంగా సంకేతాలు ఇస్తున్నారు. 
 
ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ-బీజేపీ మధ్య మైత్రి ఉండగా.. ఎన్నికలలోపు ఏదైనా జరగొచ్చు అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో.. పొత్తులపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అక్టోబర్ 2024లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్

జీ5లో SIT చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవడం ఆనందంగా ఉంది : డైరెక్టర్ విజయ భాస్కర్ రెడ్డి

రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ పై భారతీయుడు -2 లో 2వ సింగిల్

నాకు తండేల్ లాంటి సినిమా అవసరం : నాగ చైతన్య

స్వర్గీయ ఎన్టీఆర్ కు కొత్త ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలి : టి. డి. జనార్థన్

నిడదవోలులో మానసిక దివ్యాంగులకు అండగా నాట్స్

వేసవి వడగాడ్పుల సమయంలో మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన చిట్కాలు

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

తర్వాతి కథనం
Show comments