Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలోకి కన్నబాబు.. టీడీపీలోకి శత్రుచర్ల చంద్రశేఖర రాజు.. వైఎస్సార్ సన్నిహితుడు..?

మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. చంద్రశేఖరరాజు ప్రస్తుత కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి స్వయానా మామయ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డ

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (14:47 IST)
మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. చంద్రశేఖరరాజు ప్రస్తుత కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి స్వయానా మామయ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా చంద్రశఖర రాజుకు పేరుంది. 
 
వైసీపీ స్థాపించిన తరువాత జిల్లాలో ప్రప్రథమంగా జగన్‌కి మద్దతు తెలిపిన వ్యక్తి చంద్రశేఖరరాజే కావడం విశేషం. ఈ నేపథ్యంలో చంద్రశేఖర రాజు టీడీపీ పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో విజయనగరం జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో పార్వతీపురంలో చంద్రశేఖర రాజు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా శత్రుచర్లకు పార్టీ కండువా కప్పి నారా లోకేష్ టీడీపీలోకి ఆహ్వానించారు. 
 
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుతో పాటు పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు. శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే అలాంటి నేత టీడీపీలోకి జంప్ కావడం వైకాపాకు పెద్ద నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. వైకాపాలో చేరారు. తెలుగుదేశం పార్టీలు బుజ్జగించినా ఫలితం లేకపోయింది. దీంతోపాటు టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం లేదని... అందుకే పార్టీ మారాలనుకుంటున్నానని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments