Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు శుభపరిణామం: ఎంపి గురుమూర్తి

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:45 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి. తిరుపతిలోని ఎంపి కార్యాలయంలో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ ఎంపి గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్భంగా ఎంపి గురుమూర్తి బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని ఘనంగా సన్మానించారు.  

 
అనంతరం మీడియాతో తిరుపతి ఎంపి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ కోసం కేటాయించిన తిరుపతిలోని ఐదు ఎకరాల స్థలంలో ప్రపంచ శ్రేణి అకాడమీ ఏర్పాటు చేస్తానని చెప్పడం శుభపరిణామమన్నారు. ఎంతోమంది క్రీడాకారులకు అకాడమీ ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తిరుపతి ఎంపి.

 
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత కిడాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి 7లక్షల రూపాయల నగదుతో పాటు 5 ఎకరాల స్ధలాన్ని అకాడమీ కోసం ఇవ్వడంపై సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రపంచ శ్రేణి అకాడమీకి భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments