Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చూసేందుకు వెళితే... పట్టుకుని అత్యాచారం చేశారు...

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (09:25 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తన స్నేహితుడిని చూసి మాట్లాడి వచ్చేందుకు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా కురబలకోటలో జరిగింది. ఈ నెల 3వ తేదీన ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కురబలకోట మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె ఈ నెల 3వ తేదీ సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. 
 
ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతానికి కొందరు యువకులు మద్యం సేవించేందుకు వచ్చారు. ఈ తాగుబోతు యువకులు ఆ యువతిపై కన్నేసి.. దాడి చేశారు. ఆమె స్నేహితుడిని కొట్టి బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ముగ్గురూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ యువతి మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆ యువతి అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత వారంతా కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారానికి పాల్పడిన కమతంవారిపల్లెకు చెందిన అష్రఫ్, జయచంద్ర, మస్తాన్‌వల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అతిపెద్ద పైరసీ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

Vijay: నిజం బయటకువస్తుంది - త్వరలో బాధితులను కలుస్తానంటున్న విజయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments