Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ప్ర‌వాసాంధ్రుడి రూ.4.20 కోట్ల విరాళం

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (13:13 IST)
అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్న రవి ఐకా అనే ప్ర‌వాసాంధృడు ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. ర‌వి తరఫున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ గురువారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.4.20 కోట్లు విరాళం అందించారు. విరాళం చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.
 
ఈ సందర్భంగా అదనపు ఈవో, మాట్లాడుతూ,  రవి ఐకా ఇప్పటికే, టిటిడికి చెందిన ప‌లు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారని, ప్రస్తుతం తొలి విడతగా రూ.4.20 కోట్లు అందజేశారని చెప్పారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈఓ  సురేష్ కుమార్ గేదెల కూడా పాల్గొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments