Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో చంద్రబాబుకు అస్వస్థత.. పరిశీలిస్తున్న వైద్య బృందం

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (19:34 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అలర్జీ ఎక్కువ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది తీవ్రంగా మారడంతో జైలు అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. తక్షణం వైద్య బృందాన్ని పంపాలని కోరాడంతో ఒక ప్రత్యేక వైద్య బృందం జైలుకు వెళ్లి పరిశీలిస్తుంది. 
 
గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉక్కపోత, వేడిమి నెలకొని ఉండటంతో జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. అధిక వేడిమితో ఆయన అలర్జీకి గురయ్యారు. ఈ నేపథ్యంలో జైలు అధికారులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలకు సమాచారం అందించారు. దాంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యులు జైలులోకి వెళ్లారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 
హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే...  
 
తెలంగాణ రాష్ట్రంలో నవంబరు 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కార్లు, ద్విచక్రవాహనాల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు వెలుగు చూస్తుండటంతో పోలీసులు సైతం విస్తుపోతున్నారు. 
 
నిందితుల్లో అధికశాతం హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్న ముఠాలే ఉంటున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి రావటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నగరవ్యాప్తంగా వాహనాలు సోదాలు చేస్తున్నారు. ఈ నెల 9 నుంచి బుధవారం ఉదయం వరకూ హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో స్వాధీనం చేసుకున్న వాటి వివరాలిలా ఉన్నాయి.
 
అల్వాల్‌లో ఎస్‌వోటీ పోలీసులు జరిపిన తనిఖీల్లో ప్రముఖ వడ్డీ వ్యాపారిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి పట్టుబడటం కలకలం రేపింది. ఆయన నుంచి వారు రూ.24.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయాల్లో రాజకీయ నాయకులకు అప్పులు ఇవ్వడంలో పేరొందారు. ఈ క్రమంలో ఆయన నగదును తరలించబోతున్నట్లు సమాచారం అందడంతో మేడ్చల్‌ ఎస్‌వోటీ సీఐ శివకుమార్‌ బృందం నిఘా పెట్టింది. బుధవారం ఉదయం పట్టాభి నగదుతో ద్విచక్ర వాహనంలో వెళుతుండగా పట్టుకున్నారు. 
 
కూకట్‌పల్లి పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు పట్టుబడ్డాయి. మరో ఘటనలో రూ.3.5 లక్షల నగదు లభించింది. బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కూకట్‌పల్లి ప్రధాన రహదారిపై తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్‌ మంగళ్‌ఘాట్‌కు చెందిన మార్కెటింగ్‌ వ్యాపారి గజానన్ అశోక్‌ బరిగె అలియాస్‌ రాహుల్‌(33)తో పాటు బాలుడు(17) అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా 211 క్యారెట్ల వజ్రాలు, 2.311 కిలోల బంగారు నగలు లభించాయి. వాటి విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో నోట్ల కట్టలతోపాటు విలువైన ఆభరణాలు పట్టుబడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

RKSagar: నిజ జీవిత కథతో సింగరేణి కార్మికుల డ్రెస్ తో ఆర్.కె. సాగర్ చిత్రం ప్రారంభం

Chiru; నయనతారతో మీసాల పిల్ల అంటూ సాంగ్ వేసుకున్న చిరంజీవి

Kantara Chapter-1 Review: కాంతార: చాప్టర్-1 చిత్రంతో రిషబ్ శెట్టి కు విజయం దక్కిందా.. కాంతార 1.రివ్యూ

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments