Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి... సిలిండర్ పేలి..

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (13:09 IST)
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. 
 
ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు, వైరా ఎమ్మేల్యే రాములు నాయక్‌కు స్వాగతం పలికారు. అయితే బీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహంతో పేల్చిన బాణసంచా అగ్ని ప్రమాదానికి కారణమైంది. ఎంపీ, ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. వాటి నుంచి నిప్పురవ్వలు గ్రామంలోని యూపీఎస్ పాఠశాల పక్కనే వున్న జక్కుల రాములు పూరి గుడిసెపై పడ్డాయి. ఈ నిప్పు రవ్వ చిలికిచిలికి గాలి వానై గుడిసెకు మంటలు వ్యాపించాయి. దీంతో గ్రామస్తులు పూరి గుడిసెకు అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఆ మంటలపై నీళ్లు పోశారు. 
 
అయితే అప్పటికే పూరి గుడిసెలోని గ్యాస్ బండ పేలడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనాయి. వారి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments