Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ.... 13 జిల్లాలు ముగ్గురికి పంచేశారు: దేవినేని

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (11:37 IST)
రాష్ట్రంలోని మిగిలిన కులాలను డమ్మీ చేసి కేవలం పెత్తందారీ వ్యవస్థ మాత్రమే నడుస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. పైగా, రాష్ట్రంలోని 13 జిల్లాలను కేవలం ముగ్గురుకి పంచేశారని ఆరోపించారు. 
 
అంతేకాకుండా, వైఎస్ఆర్ అనే అక్షరాలకు దేవినేని కొత్త అర్థం చెప్పారు. 'వైఎస్‌ఆర్‌లో వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీబాబాయ్)కి 5 జిల్లాలు, ఎస్‌-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు, ఆర్‌-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు పంచారని ఆరోపించారు. 
 
అంతేకాకుండా, సెర్చ్ కమిటీలో 12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే. మీ ప్రభుత్వ పెత్తందారీ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? అంటూ దేవినేని ఉమమహేశ్వర రావు నిలదీశారు. పార్టీ బాధ్యతలు, రాష్ట్రంలోని ముఖ్య వ్యవహారాలు ముగ్గురికే ఇచ్చారని విమర్శలు గుప్పించారు.
 
మిగతా కులాలను డమ్మీ చేశారని, రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయం సజ్జల రామకృష్ణా రెడ్డికి, అనుబంధ విభాగాలు విజయసాయి రెడ్డికి అప్పగించారని దేవినేని ఉమ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తాజా ఫ్యాషన్ ఫోటోషూట్‌లో శృతి హాసన్ అదుర్స్

గమ్మత్తయిన గాత్రం కోసం రమణ గోగులను రంగంలోకి దింపిన అనిల్ రావిపూడి

పుష్ప-2లో ఐటమ్ సాంగ్.. శ్రీలీల ఫీజెంత.. రష్మిక మందన్న ఎంత తీసుకుంది?

ఇది నాకు స్పెషల్ మూమెంట్ : మట్కా హీరోయిన్ మీనాక్షి చౌదరి

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments