Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనర్హత వేటు వేయకుండా అడ్డుకోండి : రఘురామకృష్ణంరాజు

Advertiesment
అనర్హత వేటు వేయకుండా అడ్డుకోండి : రఘురామకృష్ణంరాజు
, శుక్రవారం, 3 జులై 2020 (11:13 IST)
తనపై అనర్హత వేటు వేయకుండా అడ్డుకోవాలంటూ వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అత్యవసరం పిటిషన్‌ను దాఖలు చేశారు. 
 
తాను యువజన రైతు శ్రామిక పార్టీ తరపున ఎన్నికైతే తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. 
 
తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని రఘురామ కృష్ణరాజు కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. 

ఏదో షో చేసుకుంటున్నారు... 
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించేందుకు వైకాపా ఎంపీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు వైకాపా ఎంపీలు ప్రత్యేక విమానంలో శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనిపై రెబెల్ ఎంపీ స్పందించారు. సీఎం జగన్‌ను పొగుడుతూనే వైసీపీ ఎంపీలను సుతిమెత్తంగా ఏకి పారేశారు. వైసీపీ ఎంపీలు విమానంలో ఢిల్లీ వెళ్లి ఓం బిర్లాను కలవాలనుకోవడంపై కూడా రఘురామకృష్ణంరాజు వ్యంగాస్త్రాలు సంధించారు.
 
'ప్రభుత్వ విమానం ఖాళీగా ఉంది.. వైసీపీ ఎంపీలు తిరుగుతున్నారు. ప్రభుత్వానికి ఖర్చు తప్ప ఏమీ ఉండదు. ప్రభుత్వ విమానంలో ఢిల్లీలో వెళ్లి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడమేంటి?. మెయిల్ ద్వారా పంపొచ్చు. ఏదో షో చేసుకుంటున్నారు అంతే. ఇదంతా పార్టీ వ్యూహం.. ప్రభుత్వం ఖర్చులో వెళ్లిపోతుంది. ఎంపీలు ఢిల్లీ వెళ్లిన ఖర్చును పార్టీ ఖర్చులో రాస్తారో.. ప్రభుత్వం ఖర్చులో రాస్తారో చూడాలి. 
 
నేను మా ముఖ్యమంత్రిని గౌరవిస్తున్నాను. పార్టీని పల్లెత్తు మాట అనలేదు. పార్టీలోని కొందరు.. దేవుడు భూములను అమ్ముకుందామనుకుంటున్నారు. ఇవాళ చిన్న భూమితో ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా ఇలానే జరుగుతుంది. అలా జరగకూడదని ముఖ్యమంత్రి జగన్‌కు తెలియజేశా. ఆయన పెద్ద మనసుతో ఆపడం జరిగింది. 
 
ఇసుకతో పాటు ఒకటి, రెండు విషయాలు కూడా చెప్పా. పార్టీలో పెద్దలు దేవుడు భూములు అమ్ముకుంటున్నారని చెప్పలేదు, ఇళ్ల స్థలాల్లో గోల్‌మాల్ చేస్తున్నారని నేను చెప్పలేదు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లా. పార్టీకి ఎందుకు కోపం వచ్చిందో. పార్టీ నాకు ఎందుకు షోకాజ్ నోటిస్ ఇచ్చిందో. కుంభకోణాలకు, పార్టీకి ఏం సంబంధమో నాకు అర్థం కావడంలేదు' అని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రహస్యంగా సరిహద్దులకు ప్రధాని నరేంద్ర మోడీ.. వెంట బిపిన్ రావత్