Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శేషాచలం అడవుల్లో దేవాంగ పిల్లులు

Webdunia
బుధవారం, 27 మే 2020 (20:31 IST)
తిరుమల శేషాచలం అడవుల్లో రెండు అరుదైన పిల్లి పిల్లలను రోడ్డు నిర్మాణ కార్మికులు గుర్తించారు. తిరుమల రెండో ఘాట్ రోడ్డు చివరి మలుపు సమీపంలో వీటిని గుర్తించారు. ఇవి దేవాంగ పిల్లులని అటవీ సిబ్బంది తెలిపారు.
 
ఈ పిల్లులు అరుదైన జాతికి చెందినవి అని, శేషాచలం అడవుల్లో నివసిస్తున్నాయని వెల్లడించారు. కాగా, కొన్ని గిరిజన జాతులవారు దేవాంగ పిల్లుల్లో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అద్భుత శక్తులున్నాయని విశ్వసిస్తారు.

భారతీయ అటవీ చట్టం ప్రకారం వీటిని పెంచుకోవడం, అమ్మడం నేరం. అందుకే అక్కడ దొరికిన పిల్లులను అదే అడవిలో వదిలిపెట్టారు.

దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తినే ఈ చిన్న జీవుల సగటు జీవితకాలం 12 నుండి 15 ఏళ్లు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments