Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బెండకాయలు, దొండకాయలకు డిమాండ్

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:23 IST)
ఏపీలో బెండకాయలు, దొండకాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వీటి ధరలు రైతు బజార్లలో కిలో రూ.40, రూ.30 వరకూ పలుకుతుండగా బహిరంగ మార్కెట్లలో కిలో రూ.60 వరకూ అమ్ముతున్నారు.

బెండ, దొండకాయల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభించడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి రావడంతో వీటి ధర ఎక్కువగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. మరో నెల రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

దోసకాయ, చిక్కుళ్లు, క్యాప్సికం ధర కూడా పెరిగింది. రైతుబజార్లలో దోసకాయ కిలో రూ.20లకు, చిక్కుళ్లు, క్యాప్సికం రూ.40కు విక్రయిస్తున్నారు. అయితే, ఇతర కూరగాయలు సామాన్యులకు కాస్త అందుబాటులోనే ఉన్నాయి.

రైతు బజార్లలో... టమోటా కిలో రూ.13, వంకాయలు దొమ్మేరు రకం రూ.24, ఇతర వెరైటీలు రూ.20, రూ.22, పచ్చిమిర్చి సన్నాలు రూ.20, పందిరి బీర కాయలు రూ.28, కేరట్‌ బెంగుళూరు రూ.15, బంగాళదుంపలు రూ.12కు విక్రయిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments