Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరికి పట్టిన శని వదిలింది: కిరణ్‌బేడీ తొలగింపుపై ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:20 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తొలగింపుపై మల్లాడి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరికి పట్టిన శనిని వదిలించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.

యానాం కేంద్రంగా పుదుచ్చేరి రాజకీయం నడుస్తోందని, రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూడడానికి యానాం ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. యానాం అభివృద్ధి కోసమే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అన్నారు.

జనవరి 6న మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రికి పత్రాన్ని ఇచ్చానన్నారు. అభి మానులకు, కార్యకర్తలకు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. యానాం బాగుకోసం, అందరి శ్రేయస్సు కోసం రాబోయే రోజుల్లో తన నిర్ణయాలు చాలా పెద్దవిగా ఉంటాయన్నారు.

పదవిలో ఉన్నా లేకున్నా నా ఊరు బాగుపడాలి, పథకాలకు ఇబ్బంది రాకూడదు, ఇంకా అనేక ప్రాజెక్టులు తీసుకురావాలన్నదే తన ధ్యేయమన్నరు. తన 31ఏళ్లఅనుభవంతో యానాం కోసం మల్లాడి సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అనుకునేలా తన నిర్ణయం ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

నార్నే నితిన్ చిత్రం ‘ఆయ్’ నుంచి రంగనాయకి సాంగ్ విడుదల

డీజే కావాలనుకునే అజయ్ ఘోష్ చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments