Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా వివాదం : సీఎం జగన్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసు

Webdunia
సోమవారం, 13 జులై 2020 (16:07 IST)
వైకాపా పార్టీ పేరు వివాదంపై ఢిల్లీ హైకోర్టు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు పంపించింది. 
 
'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' అనే పేరును ఉపయోగించే హక్కు తమకే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వైఎస్సార్సీపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. 
 
ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిందని, తమదే నిజమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మహబూబ్ బాషా కోర్టుకు తెలిపారు. 
 
'వైఎస్సార్' పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ 'అన్న వైఎస్సార్ కాంగ్రెస్' ఒక్కటేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తమ పార్టీ పేరును అక్రమంగా ఉపయోగిస్తోందంటూ ఆయన ఆరోపించారు. 
 
వైఎస్. జగన్ అధ్యక్షుడిగా వున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 
 
దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు సెప్టెంబరు 3లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని వైఎస్సార్సీపీతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ, కేసు విచారణను వాయిదావేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments