Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుముకొస్తున్న తితలీ తుఫాను .. ఉత్తర కొస్తాకు పెను ప్రమాదం

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (10:27 IST)
ఉత్తర కోస్తా జిల్లాలపై తితలీ తుఫాను దాడిచేయనుంది. తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం సోమవారం అర్థరాత్రి తీవ్ర వాయుగుండంగా మారి, మంగళవారం ఉదయానికి మరింత తీవ్రరూపం దాల్చింది. దీనికి తితలీ అనే నామకరణం చేసిన విషయం తెల్సిందే. ఈ తుఫాను ఇచ్ఛాపురం - గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే వీలుంది. ఆ సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
 
కాగా, గురువారం ఉదయం తితలీ తీరందాటే అవకాశం ఉంది. ఈ సమయంలో భారీ వర్షాలతోపాటు 100 కి.మీ.వేగంతో గాలులు ఈడ్చికొడతాయి. సముద్ర అలలు ఎగసిపడతాయి. ఈ తుఫాను ప్రభావంతో మంగళవారం విజయనగరం జిల్లా భోగాపురంలోని ముక్కాం వద్ద సముద్రం 100 అడుగుల ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ క్రమంలో ఒక బోటు తిరగబడి.. ఇద్దరు జాలర్లు గాయపడ్డారు.
 
ఈ తుఫాను ప్రస్తుతం గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 530కి.మీ. దూరంలో, కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 480కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరింత బలపడి బుధవారానికి తీవ్ర పెనుతుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. గురువారం ఉదయం కళింగపట్నం, గోపాలపూర్‌ మధ్య తీరం దాటిన తర్వాత ఈశాన్యంగా దిశ మార్చుకుని ఒడిసా తీరంవెంబడి పశ్చిమ బెంగాల్‌వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments