Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కర్ఫ్యూ పొడగింపు.. మార్పులు లేని సడలింపు వేళలు

Webdunia
సోమవారం, 31 మే 2021 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 10 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ప్యూ వేళలను మాత్రం యధాతథంగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 
 
వాస్తవానికి ప్రస్తుతం అమల్లోవున్న కర్ఫ్యూ ఆంక్షలు సోమవారంతో ముగియనున్నాయి. దీంతో ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని ఇకపై కూడా కొనసాగించనున్నారు. 
 
మరోవైపు, ఏపీలో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. 
 
ఈ కాలేజీల‌ను ఏపీలోని పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో నిర్మిస్తారని ఆయ‌న చెప్పారు.
 
రాష్ట్రంలో పేద వారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. 10,111 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 560 అర్బ‌న్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. మండ‌లానికి క‌నీసం 2 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌ను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.
 
ఏపీలో మొత్తం 176 పీహెచ్‌సీల‌ను నిర్మిస్తామ‌ని తెలిపారు. గిరిజ‌నుల కోసం రూ.246 కోట్లతో 5 గిరిజ‌న ఆసుప‌త్రులను నిర్మిస్తున్న‌ట్లు జగన్ చెప్పారు. ఇప్ప‌టికే వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి 2,436 వైద్య చికిత్స‌లు తీసుకొచ్చామ‌ని వివ‌రించారు. ప్రతి పార్లమెంట్‌ పరిధిలోనూ టీచింగ్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని జగన్ తెలిపారు. 
 
మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని వివ‌రించారు. కొత్త‌ మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments