Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్ర‌భుత్వం కూడా పెట్రో ధ‌ర రూ.10 త‌గ్గించాలి

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (09:53 IST)
కేంద్రం మాదిరిగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు రూ.10/- చొప్పున తగ్గించాల‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు రూ 10 చొప్పున తగ్గించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

 
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలంగా లీటర్ పెట్రోల్ పై రూ.36, డీజిల్ పై రూ.25 చొప్పున పెంచింద‌ని, కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కరోనా కష్టకాలాన్ని అవకాశంగా మలుచుకుని అధిక ధరల భారాన్ని ప్ర‌జ‌ల‌పై మోపింద‌ని విమ‌ర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తగా, కేంద్రం ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 తగ్గిస్తున్నట్టు కంటితుడుపు చర్యగా ప్రకటించింద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వివ‌రించారు.
 

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవటం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు అద్దం పడుతోంద‌ని, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో రవాణా రంగంపై తీవ్ర భారం పడుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయ‌ని, కరోనా బూచికి తోడు అధిక ధరల భారాల వల్ల ప్రజల జీవన స్థితిగతులు అస్తవ్యస్తంగా మారుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేవలం కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తున్నామ‌న్నారు. మోడీ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా ఇబ్బడిముబ్బడిగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేశారు.

 
కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఏపీ ప్రభుత్వం, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకంతో పాటు, లీటర్ కు రూ.4 చొప్పున అదనపు భారాన్ని ప్రజలపై మోపింద‌ని విమ‌ర్శించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై రూ.10లు తగ్గించింద‌ని, పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయ‌ని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ లపై లీటర్ కు రూ.10 చొప్పున తగ్గించాల‌ని రామకృష్ణ డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments