Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి...డీఎన్‌ఏలోనే లోపం ఉందేమో...

టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి...డీఎన్‌ఏలోనే లోపం ఉందేమో...
విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (17:23 IST)
‘‘చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా.. చంద్రబాబుకు తెలియకుండా పట్టాభి మాట్లాడతారా’’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సజ్జల పాల్గొన్నారు.
 
 ఈ సదర్భంగా సజ్జల మాట్లాడుతూ ‘‘చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఆయన దీక్షలకు పట్టుమని పది మంది కూడా స్పందించడంలేదు. బూతులు తిట్టడం అనేది చేతగాని వాళ్లు చేసే పని. సీఎం జగన్‌ సంయమనం పాటించాలని చెప్పారు. అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారు. తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా’’ అని ప్రశ్నించారు.  
 
‘‘పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంను దూషించడం సరికాదు. టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే ఉన్నాం. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం.. వీధి రాజకీయాలు చేయడానికి కాదు. ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తాం. టీడీపీ నేతలు.. వినేందుకు ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నారు. బూతులు వారే మాట్లాడతారు.. దొంగ దీక్షలు వారే చేస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు

. ‘‘టీడీపీ డీఎన్‌ఏలోనే లోపం ఉందేమో.. చంద్రబాబును చూస్తే జాలేస్తోంది.. కోపం రావడం లేదు. పట్టాబి వెనక ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడించినట్లు ఉంది. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. బాబు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్తులో ఇలాంటివే ఎదురవుతాయి. టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండి. సహ‌నానికి కూడా హద్దు ఉంటుంది. టీడీపీ నేతలు హద్దు మీరి ప్రవర్తించారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేస్తాం’’ అని సజ్జల తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్ పాసైతే బాలికలకు స్మార్ట్ ఫోన్లు.. డిగ్రీ పూర్తి చేస్తే స్కూటీలు