Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కేసులు తగ్గినా.. మృతుల సంఖ్య తగ్గలేదే...!

Webdunia
గురువారం, 27 మే 2021 (19:36 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో 14 మంది మృత్యువాత పడ్డారు. 
 
పశ్చిమ గోదావరిలో 13 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 2 వేల 967 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 325 కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 385 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 1,89,24,545 శాంపిల్స్ పరీక్షించారు.
 
జిల్లాల వారీగా మృతుల వివరాలు :
చిత్తూరులో 14 మంది, పశ్చిమ గోదావరిలో 13 మంది, విశాఖలో 11 మంది, అనంతపూర్ లో 9 మంది, నెల్లూరులో తొమ్మిది మంది, గుంటూరులో ఎనిమిది మంది, విజయనగరంలో ఎనిమిది మంది, ప్రకాశంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు మరణించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments