Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులు నడుస్తాయ్.. కానీ ప్రయాణీకులు అలా చేయాలట.. పల్లె వెలుగులో నో కండెక్టర్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (10:29 IST)
Bus
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నాలుగో దశ లాక్‌డౌన్ అమలు కానుంది. నాలుగో దశ లాక్‌డౌన్ కొత్త రూపంలో ఉంటుందని ఇటీవల ప్రధాని మోదీ వెల్లడించారు. కానీ కొన్ని రాష్ట్రాలు హాట్‌స్పాట్ కాని జోన్లలో లోకల్ బస్సులు నడిపే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. 
 
ఇందులో భాగంగా ఆటోలు, ట్యాక్సీలను కూడా ప్రయాణికుల సంఖ్యను కుదించి నడపనున్నారు. నాన్ కంటేన్మెంట్ జోన్లు ఉన్న జిల్లాల్లో ఈ బస్సు నడవనున్నాయి. అంతరాష్ట్ర బస్సు సర్వీసులను కూడా కేంద్రం పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. అయితే ట్రావెల్ పాసులు ఉన్నవారు మాత్రమే మరో రాష్ట్రానికి బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వచ్చేవారం నుంచి దేశీయ విమాన సర్వీసులను కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
 
మరోవైపు.. సుదీర్ఘ విరామం తరువాత ఈ నెల 18 నుంచి బస్సులు నడిపేందుకు పీటీడీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం సిద్ధమవుతుంది. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే బస్సులను రోడ్డెక్కించడానికి సన్నద్ధం అవుతోంది. 
 
కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం వుండేలా బస్సుల సీటింగ్‌లో మార్పులు, చేర్పులు చేస్తోంది. అదేవిధంగా ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌, లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌ అందుబాటులో ఉంచనున్నది. 
 
కానీ పల్లె వెలుగు బస్సుల్లో సీట్లను మార్చడం లేదు. అయితే 50 సీట్లకుగాను 30 సీట్లలో మాత్రమే ప్రయాణికులు కూర్చోవాలి. ఈ మేరకు ఆయా బస్సుల్లో మార్కింగ్‌ చేయిస్తున్నారు. బస్సుల్లో నిల్చుని ప్రయాణించడానికి అనుమతించరు. 
 
పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్లు ఉండరు. డ్రైవర్ల వద్ద టిమ్స్‌ ఉంటాయి. బస్టాండ్‌లో బస్సు ఎక్కే ముందే అక్కడ వుండే సిబ్బంది టిమ్స్‌తో టిక్కెట్లు జారీచేస్తారు. గతంలో మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపరు. లిమిటెడ్‌ హాల్ట్స్‌ మాత్రమే ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments