Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఆస్పత్రి నుంచి పారిపోయిన వృద్ధురాలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (23:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో ఓ కరోనా వైరస్ రోగి కోవిడ్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత అధికారులు నానా తంటాలు పడి ఆమెను గుర్తించి, తిరిగి తీసుకొచ్చి పోలీసు భద్రత మధ్య ఐసోలేషన్ వార్డులో ఉంచారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను కర్నూలు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
అయితే, ఈ ఐసోలేషన్ వార్డులో ఉండలేని ఆమె.. వైద్య సిబ్బంది, నర్సుల కళ్లుగప్పి.. వార్డు నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వైద్యులు.. అధికారులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత పట్టణమంతా గాలించగా, ఆదోనీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొదుకూరు మండలం, యాలకుర్తి గ్రామంలో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమెను తిరిగి పోలీసుల సహాయంతో తీసుకొచ్చి తిరిగి ఆస్పత్రిలో చేర్చారు. పైగా, ఆమెతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments